Mehidy Hasan Miraz : ప్రాణంగా ప్రేమించిన ఆటలో నిలకడగా రాణించిన యువ క్రికెటర్‌కు అందుకు తగిన గౌరవం దక్కింది. ఇన్నాళ్లు జట్టు సభ్యుడిగా ఉన్న అతడు ఇకపై నాయకుడిగా అందర్నీ ఒక్కతాటిపై నడిపించనున్నాడు. అతడు ఎవరో కాదు మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz). గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మిరాజ్ వన్డే సారథిగా ఎంపికయ్యాడు. నజ్ముల్ హుసేన్ శాంటో (Nazmul Hussain Shanto) నుంచి అతడు పగ్గాలు స్వీకరించనున్నాడు. సీనియర్లను కాదని ఈ యువ ఆల్‌రౌండర్‌కు కెప్టెన్సీ అప్పగించడం బంగ్లా క్రికెట్లో సంచలనమనే చెప్పాలి.
శాంటో వారసుడిగా వన్డే సారథ్యాన్ని స్వీకరించనున్న మిరాజ్ ఏడాది పాటు ఈ హోదాలో కొనసాగుతాడని బంగ్లాదేశ్ బోర్డు తెలిపింది. ‘మిరాజ్ గత కొంత కాలంగా అద్భుతంగా ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు బ్యాటుతో, బంతితో నిలకడగా రాణిస్తున్నాడు. యువకుడైన అతడు తన సంచలన ప్రదర్శనతో జట్టుతో ఉత్సాహం నింపుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. అందుకే.. మిరాజ్‌కు వన్డే కెప్టెన్నీ అప్పగించాలని బోర్డు భావించింది’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ సభ్యుడు నజ్ముల్ అబెదీన్ వెల్లడించాడు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Bangladesh all-rounder Mehidy Hasan Miraz has been appointed as the new ODI skipper, replacing Najmul Hossain Shanto. 🇧🇩🤝#Bangladesh #ODIs #Captain #MehidyHasanMiraz #Sportskeeda pic.twitter.com/8LavJGeBWL
— Sportskeeda (@Sportskeeda) June 12, 2025
రెండేళ్ల క్రిత భారత్‌పై మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన మిరాజ్.. ఆ తర్వాత కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. గతంలో నాలుగు మ్యాచుల్లో ఈ చిచ్చరపిడుగు బంగ్లాకు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. శాంటో గైర్హజరీలో అతడు జట్టును నడిపించాడు. ఆ అనుభవం కూడా అతడికి కెప్టెన్సీ వచ్చేలా చేసిందని చెప్పొచ్చు.
జూలైలో శ్రీలంక పర్యటనతో మిరాజ్‌కు తొలి సవాల్ ఎదురుకానుంది. మొత్తంగా 105 వన్డేల్లో ఈ యువకెరటం 1,617 రన్స్ సాధించాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మిరాజ్ 4 వ స్థానంలో కొనసాగుతున్నాడు.