Convert lands | కాల్వశ్రీరాంపూర్, జూన్ 12 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం శివారులోని సర్వే నెంబర్ 800 నుండి 854 వరకు ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని తప్పుగా నమోదైందని, వాటిన వెంటనే సవరించాలని అధికారులను కోరారు. కూనారంలో గరువారం జరిగిన రెవెన్యూ సదస్సులలో తహసీల్దార్ జగదీశ్వర్రావుకు గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ పంట పండించుకుంటున్నామని అన్నారు. తప్పుగా నమోదు అయినందున వాటిని వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరారు. అదే విదంగా గ్రామంలోని చాలా మంది రైతుల భూములు మరణించారు. గ్రామంలో లేరు అని నమోదైందని, వాటిని మోఖా పై పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూనారం సహకార సంఘం చైర్మన్ గజవెళ్లి పురుషోత్తం, మాజీ చైర్మన్ కొట్టె సమ్మయ్య, నాయకులు తిరుపతి, శంకర్ తదితరులు ఉన్నారు.