IPL 2025 : జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బ్యాటర్లు చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేశారు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(66), ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుశ్ బదొని(50)లు ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ అర్థ శతకాలతో చెలరేగి భారీ స్కోర్‌కు పునాది వేశారు. ఆఖర్లో అబ్దుల్ సమద్(30 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో ఏకంగా బంతిని నాలుసార్లు స్టాండ్‌లోకి పంపాడు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలో తడబడినా ఆ తర్వాత నిలబడింది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ల విజృంభణతో 46కే రెండు వికెట్లు కోల్పోయిన ఎల్ఎస్జీని ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(66) ఆదుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ తన రెండో ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్(4)ను పెవిలియన్ పంపి బ్రేకిచ్చాడు. డేంజరస్ నికోలస్ పూరన్(11)కు 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సందీప్ శర్మ రౌండ్ ది వికెట్ వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
Juggle. Fumble. Grab. Got him! 👀
Dhruv Jurel holds onto the edge to dismiss Rishabh Pant 🧤
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qeQJxNwUfL
— IndianPremierLeague (@IPL) April 19, 2025
ఇక హసరంగ బౌలింగ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్(3) రివర్స్ స్వీప్ ఆడబోయి వికెట్ కీపర్ జురెల్‌కు దొరికాడు. అంతే.. 53 వద్ద మూడో వికెట్ పడింది. రాజస్థాన్ బౌలర్లు చెలరేగుతున్న ఆ పరిస్థితిలో మర్క్రమ్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఏమాత్రం ఒత్తిడిలోకి లోనవ్వకుండా ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుశ్ బదొని(50)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
The 𝙥𝙖𝙧𝙩𝙣𝙚𝙧𝙨 who sailed the #LSG 𝙨𝙝𝙞𝙥 🤝
Aiden Markram & Ayush Badoni stitched a solid 76-run partnership to put LSG at 131/4 after 16 overs.
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/wSEOjlblT9
— IndianPremierLeague (@IPL) April 19, 2025
రాజస్థాన్ బౌలర్లకు పరీక్ష పెట్టిన మర్క్రమ్, బదొని వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ఈ క్రమంలోనే మర్క్రమ్ అర్ద శతకం నమోదు చేశాడు. నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. అయితే.. హసరంగ వేసిన 15వ ఓవర్లో మర్క్రమ్ పెద్ద షాట్ ఆడి పరాగ్ చేతికి చిక్కాడు.దేశ్పాండ్ ఓవర్లో బౌండరీతో అర్థ శతకం పూర్తి చేసుకున్న బదొని.. ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు. యార్కర్లు సంధించిన ఆర్చర్ 19వ ఓవర్లో 7 రన్స్ ఇచ్చాడంతే. సందీప్ వేసిన 20వ ఓవర్లో అబ్దుల్ సమద్(30 నాటౌట్) ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టి 27 రన్స్ రాబట్టాడు. దాంతో, 160 లోపే పరిమితం అవుతుందనుకున్న లక్నో.. రాజస్థాన్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.