England Cricket : లార్డ్స్ టెస్టులో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండు టెస్టులోనూ విజయంపై గురి పెట్టింది. నాటింగ్హమ్లో వెస్టిండీస్ (West Indies)తో జరిగే రెండో టెస్టు కోసం సెలెక్టర్లు 14 మందితో కూడిన స్క్వాడ్‌ను జట్టును ప్రకటించారు. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు పలకడంతో అతడి స్థానంలో మార్క్ వుడ్ (Mark Wood)ను తీసుకున్నారు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే 12 వికెట్లు పడగొట్టిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) తన స్థానం పదిలం చేసుకున్నాడు. దేశం తరఫున ఆడుతున్న తొలి టెస్టులోనే అర్ధ శతకంతో రాణించిన యువ కెరటం జేమీ స్మిత్‌కు కూడా మరో చాన్స్ వచ్చింది.
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్, డాన్ లారెన్స్, డిల్లాన్ పెన్నింగ్టన్, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
ప్రస్తుతం ఇంగ్లండ్ బౌలింగ్ యూనిట్లో వుడ్‌కే అనుభవం ఎక్కువ. ఇప్పటివరకూ 34 మ్యాచులు ఆడిన ఈ స్పీడ్‌స్టర్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు 108 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దాంతో, సెలెక్టర్లు వుడ్ ఎంపికతో అండర్సన్ లోటును భర్తీ చేయాలని నిర్ణయించారు.

సొంతగడ్డపై తమకు తిరుగుండదని చాటిన ఇంగ్లండ్ లార్డ్స్ టెస్టులో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో 371 రన్స్ కొట్టిన ఇంగ్లండ్ ఆ తర్వాత కరీబియన్ బ్యాటర్ల భరతం పట్టింది. గస్ అట్కిన్సన్ (7/45, 5/61) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బెంబేలెత్తించడంతో విండీస్ కుప్పకూలింది. దాంతో, మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో, జూలై 18న మొదలయ్యే నాటింగ్హమ్ టెస్టులో పుంజుకోవాలని క్రెగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలోని విండీస్ భావిస్తోంది.
What is Jimmy’s Best Wicket? ☝
We’re down to the final two…
A signed shirt up for grabs 👕
🗳 Get voting now! 👇— England Cricket (@englandcricket) July 11, 2024