Criminals arrest | చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
Criminals arrest | సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు.
Criminals : సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు. సైబరాబాద్ స్పెషల్ పోలీస్ టీమ్స్.. గుజరాత్‌కు చెందిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని గుర్తించారు.
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పసిపిల్లలను రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో గుజరాత్ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

