Manchu Vishnu | సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తూన్న తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు యూట్యూబ్ వేదికగా హెచ్చరించాడు. అయితే చెప్పినట్లుగానే 48 గంటల అనంతరం సినీ నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై కొరడా ఝుళిపించింది. ఈ విషయాన్ని ‘మా’ అసోసియేషన్ ఎక్స్ ద్వారా వెల్లడించింది.
సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్‌ను టర్మినేట్ చేయించినట్లు ‘మా’ వెల్లడించింది. ఇక ఈ 5 యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటే.. ‘జస్ట్ వాచ్ బీబీసీ’, ‘ట్రోల్స్ రాజా’. ‘బచ్చిన్ లలిత్’, ‘హైదరాబాద్ కుర్రాడు’ తదితర ఛానల్స్‌ను యూట్యూబ్ అధికారుల సాయంతో తోలగించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే నంటూ మిగిలిన యూట్యూబర్స్కు హెచ్చరిక పంపించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తెలుగు యూట్యూబర్లు ఈ మధ్య చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలానే వీడియోలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ మన తెలుగు వాళ్లు ఇలా ఎలా చేయగలుగుతున్నారు. తెలుగు వారు అంటే సంస్కృతి, సంప్రదాయాలు మర్యాదస్తులు, పద్దతిగా ఉంటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అని వరల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వాళ్లు ఇలాంటి వీడియోలు చేయడం తప్పు అంటూ ఒక వీడియో విడుదల చేశాడు.
నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు హెచ్చరించాడు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని విష్ణు హెచ్చరించారు. ఇక నుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు.
Terminated Channels:
1. Just Watch BBC https://t.co/Hp0jjIMyYb
2. Trolls Raja https://t.co/v6UE3tuJiS
3. Bachina Lalith https://t.co/pDBaOs73Nl
4. Hyderbad Kurradu https://t.co/bFp3NxWrVy
5. xyzeditz007 https://t.co/J5VsuRpsCIStay tuned for more updates#MAA #RespectOurArtists
— MAA Telugu (@itsmaatelugu) July 13, 2024
Also Read..
“Manchu Vishnu | ట్రోలింగ్ పోస్టులు పెడితే ఊరుకోం.. తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్”
“Manchu Vishnu | సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మంచు విష్ణు.. ఎందుకంటే.?”