Manchu Vishnu | సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తూన్న తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు యూట్యూబ్ వేదికగా హెచ్చరించాడు. అయితే దీనిపై మంచు విష్ణు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తెలుగు యూట్యూబర్లు ఈ మధ్య చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలానే వీడియోలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ మన తెలుగు వాళ్లు ఇలా ఎలా చేయగలుగుతున్నారు. తెలుగు వారు అంటే సంస్కృతి, సంప్రదాయాలు మర్యాదస్తులు, పద్దతిగా ఉంటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అని వరల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వాళ్లు ఇలాంటి వీడియోలు చేయడం తప్పు అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. అయితే ఈ ఈ వీడియోపై విష్ణుకు సోషల్ మీడియాలో సపోర్ట్‌తో పాటు విమర్శలు ఎదురవుతున్నాయి. మంచు విష్ణు డార్క్ కామెడీ చేయొద్దని అందరికి చెబుతున్నాడు.. కానీ ముందు అతడు ఇది ఫాలో అవ్వాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఇంతకుముందు విష్ణు నటి కాజల్ ఆగర్వల్పై చేసిన కామెంట్లను నెటిజన్లు ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మోసగాళ్లు(Mosagallu). ఈ సినిమాలో వీళ్లిద్దరు అక్క తమ్ముడిగా నటించారు. అయితే ఈ మూవీ వేడుకలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా పాత్రలను గేమ్ ఆఫ్ థోర్న్స్(Game Of Thornes) వెబ్ సిరీస్‌లో ఉన్నట్లు బ్రదర్, సిస్టర్ (ఈ సిరీస్‌లో బ్రదర్, సిస్టర్లే రహస్యంగా ప్రేమించుకుంటారు) రోల్స్ చేయాలి అనుకున్నాం అంటూ విష్ణు వెల్లడించారు. ఇది చెబుతున్నప్పుడు కాజల్ వచ్చి విష్ణుని కొట్టడం చూడవచ్చు. ఇక విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రోల్‌కి గురవుతున్నాయి. మంచు విష్ణు ఒకరికి చెప్పేముందు తాను ఎలాంటి వాడో తెలుసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Since praneeth is arrested, want to bring an incident into notice where manchu vishnu made a joke in reference to Game of thrones.Again, there was no outrage . Afterall i need to see joke as a joke. PH maybe rightly facing consequences,but people in power,TFI always get away pic.twitter.com/n39V5Udi98
— Pranay (@Pranay93706587) July 10, 2024
Kajal tho GOT type siblings ani stage meedha annadhi eede kada ? https://t.co/YEt2yUZ5Nw
— SP (@Just__SP) July 10, 2024
Also Read..