మెగా వెడ్డింగ్ వేడుకకు ముంబై సిద్ధం : వాణిజ్య రాజధానికి పోటెత్తిన అతిధులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలకు ముంబై సిద్ధమైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలకు ముంబై సిద్ధమైంది. అత్యంత అట్టహాసంగా జరగనున్న ఈ వెడ్డింగ్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు తరలివస్తున్నారు.
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముంబై చేరుకున్నారు. దేశ వాణిజ్య రాజధానిలో శుక్రవారం జరగనున్న కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. వివాహ వేడుకల నేపథ్యంలో బాంద్రా కుర్లా ప్రాంతంలో (Bandra Kurla Complex) పోలీసులు మూడు రోజులపాటు పలు ఆంక్షలు కూడా విధించారు.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.
Read More :
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

