Railway Rules | రైల్వేశాఖ కీలక నిర్ణయం..! కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే భారీ జరిమానా తప్పదు..!
Railway Rules | దేశంలో అతిపెద్ద రవాణావ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ వస్తున్నది. తక్కువ ఖర్చుతో పాటు మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైలులోనే ప్రయాణానికి మొగ్గుచూపుతుంటారు.
Railway Rules | దేశంలో అతిపెద్ద రవాణావ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ వస్తున్నది. తక్కువ ఖర్చుతో పాటు మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైలులోనే ప్రయాణానికి మొగ్గుచూపుతుంటారు. రైలు ప్రయాణానికి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. చాలామంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండునెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటుంటారు. అయితే, అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్ టికెట్లను సైతం రైల్వే జారీ చేస్తూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో పలువురు టికెట్లు దొరకని సందర్భాల్లో వెయిటింగ్ టికెట్‌తోనే స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తుంటారు.
దీంతో ఆయా క్లాస్‌లో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగడంతో పాటు భద్రత విషయంలో రైల్వేశాఖకు ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ఒక క్లాస్ టికెట్ కొనుగోలు చేసి మరో క్లాస్‌లో ప్రయాణించడం కూడా నేరమే. తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరించింది. టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఏసీ, స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా రైల్వేశాఖ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణం స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చూస్తూ దొరికితే రూ.250, ఏసీ కోచ్‌లో ప్రయాణం పట్టుబడితే రూ.440 జరిమానా విధించడంతో పాటు ఆ తర్వాత స్టేషన్ నుంచి అమలయ్యే ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నారు. జరిమానా, ఛార్జీలు చెల్లించడంలో విఫలమైనా.. నిరాకరించినా రైల్వేచట్టంలోని సెక్షన్ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
దీంతో స్లీపర్, ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఊరట కలుగనున్నది. కొందరు టికెట్లు కన్ఫర్మ్ కాకుండానే స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఎక్కి.. బుక్ చేసుకున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాము సైతం టికెట్ బుక్ చేసుకోమని.. కూర్చునేందుకు స్థలం ఇవ్వాలంటూ గోల చేస్తుంటారు. ఏసీ క్లాస్‌లో ఇలాంటి ఘటనలు తక్కువగానే జరిగినా.. స్లీపర్ క్లాస్‌లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇకపై కన్ఫర్మ్ టికెట్లు లేకుండా కన్ఫర్మ్ కోచ్‌లో ప్రయాణిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో తప్పనిసరిగా ప్రయాణానికి ముందు తప్పనిసరిగా టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలని.. ఆ తర్వాత రైలు ఎక్కాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

