Tejasvi Surya : వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశాయని బీజేపీ ఎంపీ, బీజేవైఎం చీఫ్ తేజస్వి సూర్య అన్నారు. ఈ స్కామ్ కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని వెల్లడిస్తోందని చెప్పారు. ఈ స్కామ్‌లో నిందితుడు రూ. 100 కోట్ల నిధులను వివిధ బ్యాంకు ఖాతాలు, షెల్ ఖాతాలకు మళ్లించారని తెలిపారు.
నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ డీలర్ నుంచీ లగ్జరీ కారు కొనుగోలు చేసినట్టు వెల్లడైందని చెప్పారు. దేశంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఎందుకు తమ సీఎంపై చర్యలు చేపట్టలేదని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. గిరిజన అభివృద్ధికి మీ మోడల్ ఇదేనా అని కాంగ్రెస్ నేతలను తేజస్వి సూర్య నిలదీశారు.
ఈ స్కామ్‌పై ఈడీ దర్యాప్తునకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు సహకరించడం లేదని ఆరోపించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఈ కేసు దర్యాప్తు నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.వాల్మీకీ కార్పొరేషన్ స్కామ్‌పై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని తాము కోరుకుంటున్నామని తేజస్వి సూర్య స్పష్టం చేశారు.
Read More :
Jennifer Lopez: 15 కోట్ల డాలర్ల బెన్ అఫ్లెక్ ఆస్తిలో.. సగం డిమాండ్ చేస్తున్న జెన్నిఫర్ లోపేజ్