న్యూఢిల్లీ: జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్.. ప్రస్తుతం విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ జంట 2022లో పెళ్లి చేసుకున్నది. గత కొన్ని నెలల నుంచి ఆ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగాలేదు. అయితే పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్.. భారీ స్థాయిలో భరణం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటుడు బెన్ అఫ్లెక్‌కు చెందిన 150 మిలియన్ల డాలర్ల ఆస్తిలో.. సగం వాటా కావాలని జెన్నిఫర్ డిమాండ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. రేడార్ ఆన్లైన్ అనే వెబ్‌పోర్టల్ దీనికి సంబంధించిన కథనాన్ని రాసింది.
నిజానికి జెన్నిఫర్ లోపేజ్ ఆస్తి సుమారు 400 మిలియన్ల డాలర్లుపైనే ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఒక్కటైన తర్వాత .. జెన్నిఫర్ భారీ స్థాయిలో ఖర్చు చేసింది. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం బెన్ అఫ్లెక్ నుంచి లాగేయాలని ఆమె చూస్తోంది. ఒక మంచి వ్యక్తిలా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు అని, కానీ జెన్నిఫర్‌ను అఫ్లెక్ పట్టించుకోవడం లేదని, అందుకే అతను జరిమానా చెల్లించక తప్పదు అని ఓ ప్రతినిధి తెలిపారు.
జెన్నిఫర్ లోపేజ్ కన్నా ముందు.. జెన్నిఫర్ గార్నర్‌ను బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో మార్క్ ఆంథోనీతో జరిగిన పెళ్లి వల్ల.. జెన్నిఫర్ లోపేజ్ కవలలకు జన్మనిచ్చింది.