Manchu Vishnu | సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు హెచ్చరించాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశాడు.
తెలుగు వారు అంటే వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు ఉంది. తెలుగు వాళ్లు అంటే మర్యాదస్తులు, పద్దతిగా ఉంటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అని చెబుతారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్స్ అసభ్యకరంగా ప్రవర్తించడం వలన మొత్తం తెలుగు జాతికి ఈ చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య తెలుగు యూట్యూబర్ ఫనుమంతు చిన్న పిల్లలపై చేసిన నీచపు కామెంట్లపై నా తమ్ముడు సాయి ధరమ్ తేజ్ స్పందించడం వలన ఈ ఘటన నాకు తెలిసింది. ఇది ఎంత భయకరంగా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించడం మంచి విషయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెబుతున్నాను.
ఈ హనుమంతు నిజానికి మంచి కుటుంబం నుంచి వచ్చాడు అయిన కూడా ఇతడు ఇంతలా తండ్రి కూతుళ్లపై అసభ్యకరంగా కామెడీ చేసి ఎందుకు ఆనందపడుతున్నారనేది నాకు అర్థం కాలేదు. అది చాలా పెద్ద తప్పు. అసలు మన తెలుగువాళ్ళం అలాంటి వాళ్ళం కాము కానీ, కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
అలాగే నటినటులను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు హెచ్చరించాడు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని విష్ణు హెచ్చరించారు. ఇక నుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు.
Also Read..