Poonam Kaur – Trivikram | టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి పూనం కౌర్. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌పై పూనం విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చిన్న పిల్లల విషయంలో అమ్మాయిల విషయంలో సెక్స్‌వల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బుధవారం తెలంగాణ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ చిన్నపిల్లలతో పాటు ఆడపిల్లలపై ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమి కాదని ఇంతకుముందు కూడా తెలుగు హీరోలు కూడా ఇలాంటి చేశారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే ఇందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాపై కూడా ప్రస్తావన వచ్చింది.
జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెబుతాడు. పడుకోని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఆనందం ఏముంటుంది.. పరిగెత్తించి పరిగెత్తించి చేయాలి అనే డైలాగ్ ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై రీసెంట్గా పూనం ఎక్స్‌లో స్పందిస్తూ.. త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది అని తెలిపింది. దీనికి ఒక నెటిజన్ కౌంటర్ ఇస్తూ.. త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో చెప్పకండి అందరికి తెలుగు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అని పెట్టాడు. ఈ కామెంట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది పూనం కౌర్.
త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని మరోసారి ఫైర్ అయింది.

Poonam KAUR
Also Read..