Amarkantak Express | అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం..!
Amarkantak Express | అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మంటలు వచ్చాయి. రైలు ఏసీ కోచ్‌లో కింది భాగంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పొగ కమ్మేసింది. మధ్యప్రదేశ్‌లోని మిస్రోడ్-మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
Amarkantak Express | అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మంటలు వచ్చాయి. రైలు ఏసీ కోచ్‌లో కింది భాగంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పొగ కమ్మేసింది. మధ్యప్రదేశ్‌లోని మిస్రోడ్-మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. బీ-3, బీ4 ఏసీ కోచ్‌ల కింద భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది.
అయితే, ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పలువురు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు 27 స్టాప్స్ ఉన్నాయి. ఇంతకు ముందు జూన్ 27న షాడోల్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్ పక్కనే ఉన్న యార్డులో గూడ్స్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పలు కోచ్‌లు సమీపంలోని మరో గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత ట్రాక్‌లోని నాలుగు లైన్లు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్యాసింజర్ నష్టం జరుగలేదు. అందులో ఉన్న వారికి క్షేమంగా బయటపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

