Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు హాజరయ్యారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లికృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వరకు కొనసాగింది.
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ముఖ్యమైన రైతు భరోసా పథకంపైనా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, జాబ్ క్యాలెండర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
KTR | సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR | తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆశిస్తున్నా.. కేటీఆర్ ట్వీట్
KTR | ఈ మహా నగరానికి ఏమైంది..?.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
RS Praveen Kumar | కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : ఆర్ఎస్పీ