KTR | సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR | ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజజ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని గుర్తు చేశారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్.
KTR | హైదరాబాద్ : ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజజ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని గుర్తు చేశారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. ఈ సారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు శుభవార్త అందేలా చూడాలని బండి సంజయ్‌ను కేటీఆర్ కోరారు.
కేటీఆర్ లేఖ సారాంశం..
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశానే ఎదురైందన్నారు. గతంలో పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. సుమారు పదిసార్లు కేంద్రంలో స్మ్రతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం అన్నారు. బండి సంజయ్‌ను కూడా ఎన్నోసార్లు ఈ అంశంలో సహకారం అందించాలని కోరినప్పటికీ మీరు పట్టించుకోలేదన్నారు. అయితే రెండోసారి మీరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిది సరైన సమయం అని గుర్తించండి అని తెలిపారు.
ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్‌ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి మీరు గుర్తించండన్నారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తర్వతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటీఅర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న ఈ కీలక సమయంలో వారిని ఆదుకునే మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం, భాదకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేకరకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందున, అన్నీ సానుకూలాంశాలున్న సిరిసిల్లాకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బడ్జెట్‌కు ముందుకు ఈ అంశంలో కేంద్రానికి విజ్జప్తి చేసేవారమన్నారు. ఈ బడ్జెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖా మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రాధన్యతను, దాని వల్ల జరిగే లబ్దిని, వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారని, కానీ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు గానీ సిరిసిల్ల నేతన్నలకుగానీ బండి సంజయ్ పదవీకాలంలో జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులను, పరిశ్రమలను తరలించుకుపోతున్నారని, కనుక తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో కచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆశిస్తున్నా.. కేటీఆర్ ట్వీట్
KTR | ఈ మహా నగరానికి ఏమైంది..?.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
RS Praveen Kumar | కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : ఆర్ఎస్పీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

