Yadagirigutta Brahmotsavam | 18 నుంచి యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు.. వివరాలు వెల్లడించిన ఈవో భవానీశంకర్
Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న స్వస్తీవాచనం, అంకురార్పణ, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 24న ఎదుర్కోళ్లు, 25న స్వామివారి తిరుకల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం, 27న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 28న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని పేర్కొన్నారు.
ఆరు రోజులపాటు అలంకార సేవలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినట్టు అన్నారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపకాంతులతో మిరిమిట్లు గొలిపే అలంకరించనున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18 నుంచి 28వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్టు ఈవో ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

