న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కుమార్తె ఫోబే గేట్స్ తన స్టార్టప్ కంపెనీ ఫియా మార్కెటింగ్ యాప్‌తో అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బ్లూమ్‌బర్గ్ ఓ కథనాన్ని రాసింది. కుకీ స్టఫింగ్ స్కీమ్‌తో .. తన యాప్‌లో యూజర్స్‌ను తప్పుదోవ పట్టింది, ఆ తర్వాత అమ్మకాలపై అక్రమ రీతిలో కమీషన్లు తీసుకున్నట్లు ఫోబే గేట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ సోఫియా కియన్నాతో కలిసి ఫోబే గేట్స్.. ఫియా అనే మార్కెటింగ్ యాప్‌ను రిలీజ్ చేశారు.
డిజిటల్ షాపింగ్‌కు సంబంధించిన చీప్ ప్రోడక్ట్స్, డిస్కౌంట్ కోడ్స్ ఆ యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసే యూజర్ బ్రౌజర్లకు ట్రాకింగ్ కుకీలను ఆటోమెటిక్‌గా పంపుతున్నారని, షాపింగ్ చేసేవారు తమ కూపన్లు, లింకులను వాడకున్నా.. ఫియా కంపెనీ మాత్రం సేల్స్‌పై కమీషన్లు రాబట్టినట్లు బ్లూమ్‌బర్గ్ తన రిపోర్టులో తెలిపింది.
ఫెడరల్ చట్టాల ప్రకారం కుకీ స్టఫింగ్ నేరం అవుతుంది, ఒకవేళ ఆ కేసులో దోషిగా తేలితే, బిల్ గేట్స్ కుమార్తెకు సుమారు 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. సుమారు ఏడు నెలల పాటు ఫోబే గేట్స్, కియాన్ని తోడుగా కమిషన్ల కోసం కంపెనీలను మోసం చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తన రిపోర్టులో చెప్పింది. కుకీ డ్రాపింగ్ వల్ల ఆదాయం బాగా వస్తున్నట్లు కూడా గతంలో ఈ ఇద్దరూ కంపెనీ సమావేశాల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుకీ స్టఫింగ్ ఫీచర్‌ను జూలైలో డిజేబుల్ చేశారు.