KL Rahul : సుదీర్ఘ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ (KL Rahul) కెరీర్ ప్రశ్నార్థకం కానుంది. న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో, పుణేలో జరుగబోయే రెండో టెస్టుకు అతడు జట్టులో ఉండడం సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. 91 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు సొంత గడ్డపై చెలరేగి ఆడుతాడనుకంటే కివీ బౌలర్ల ఉచ్చులో పడి వికెట్ పారేసుకున్నాడు. మరోవైపు టెస్టుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాహుల్ సగటు 33.98 మాత్రమే ఉండడం అతడి వైఫల్యానికి నిదర్శనం అంటున్నాడు మాజీ ఆటగాడు మనోజ్ తివారీ (Manoj Tiwary).
విదేశీ పర్యటనల్లో ముఖ్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో రాహుల్ నాలుగైదు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీనియర్ అయిన అతడిని నవంబర్‌లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకోసం తీసుకోవాలనే ఉద్దేశంతో మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. అయినా రాహుల్ ఆట మారలేదు. బంగ్లాదేశ్‌పై పెద్దగా రాణించని రాహుల్.. కివీస్‌పై కూడా కష్ట సమయంలో కొండంత అండగా నిలుస్తాడనుకుంటే తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో, అతడి బదులు రంజీల్లో ఇరగదీస్తున్న అభిమన్యు ఈశ్వర్‌ను ఆడించాలని మనోజ్ తివారీ అభిప్రాయ పడుతున్నాడు.
‘టెస్టుల్లో రాహుల్ గణాంకాలు నిరాశపరిచేలా ఉన్నాయి. 91 ఇన్నింగ్స్‌ల్లో అతడిది 33.98 సగటు అంతే. అయితే.. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. టెస్టుల్లో 4వ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) ఏ తరహాలో ఆడాడో చూశాం. ఇక.. అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) కూడా గొప్ప ఆటగాడే. అతడికి ఓపెనర్ ట్యాగ్ ఇవ్వొచ్చు. అభిమన్యు ఒక స్పెషలిస్ట్ ఓపెనర్. గత పది ఇన్నింగ్స్‌ల్లో అతడు కనీసం ఐదారు సెంచరీలు కొట్టి ఉంటాడు. అందుకని మిడిలార్డర్లో రాహుల్ బదులు అభిమన్యను ఆడిస్తే మేలు’ అని తివారీ వెల్లడించాడు.
సొంతగడ్డపై ఎదురులేని టీమిండియాకు దిమ్మదిరిగే షాకిచ్చింది న్యూజిలాండ్. చిన్నస్వామి స్టేడియంలో ఆల్‌రౌండ్ షోతో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్.. అనంతరం 107 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. దాంతో, బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ వైట్‌వాష్ చేసిన రోహిత్ సేనకు గర్వభంగం అయింది.
New Zealand’s win in first #INDvNZ Test shakes up the #WTC25 standings 👀
More ➡️ https://t.co/aGNt1GAOJA pic.twitter.com/FmuwwDwTyZ
— ICC (@ICC) October 20, 2024
అంతేకాదు సూపర్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25)లో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. మరోవైపు ఊహించని విధంగా ఓటమి పాలైన టీమిండియా మాత్ర అగ్రస్థానం కాపాడుకుంది. ఆస్ట్రేలియా, శ్రీలంకలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.