Smriti Mandhana | టైటిల్ గెలవడం గొప్పే.. కోహ్లీతో పోల్చడం ఆపేయండి..!
Smriti Mandhana : స్మృతి మంధాన... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏండ్ల ట్రోఫీ కలను నిజం చేసింది. దాంతో మంధానపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ ట్రోఫీ బెంగ తీర్చిన ఆమెను ఏకంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోల్చుతున్నారు. కానీ, మంధాన మాత్రం పొగడ్తలకు...
Smriti Mandhana : స్మృతి మంధాన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏండ్ల ట్రోఫీ కలను నిజం చేసింది. దాంతో మంధానపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ ట్రోఫీ బెంగ తీర్చిన ఆమెను ఏకంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోల్చుతున్నారు. కానీ, మంధాన మాత్రం పొగడ్తలకు పొంగిపోవడం లేదు. డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచినంత మాత్రాన తాను గాల్లో తేలిపోవట్లేదని చెప్పింది. అంతేకాదు గొప్ప క్రికెటర్ అయిన కోహ్లీతో తనను పోల్చడం సరికాదని స్పష్టంగా చెప్పేసింది. కోహ్లీ తన 16 ఏండ్ల కెరీర్లో ఎంతో సాధించాడని మంధాన తెలిపింది.
‘టైటిల్ గెలవడం అనేది గొప్ప విషయమే. అయితే.. టీమిండియా తరఫున కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీతో నన్ను పోల్చడం సరికాదు. అతడి కెరీర్‌తో చూసుకుంటే నా కెరీర్ చాలా చిన్నది. అందుకనే కోహ్లీతో పోలికను నేను అంగీకరించను. అతడొక మా అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. డబ్ల్యూపీఎల్ టైటిల్ అన్నింటినీ మార్చేయలేదు. అతడంటే మా అందరికీ ఎంతో గౌరవం’ అని మంధాన వెల్లడించింది.
— priyam ~ media account (@dunkimedia) March 19, 2024
It had to be him, no better feeling than celebrating this with the man who’s done so much for this franchise from its inception! 🥹❤🔥#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #ViratKohli pic.twitter.com/gdce2cPpB2
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
అంతేకాదు మా ఇద్దరి జెర్సీ నంబర్ 18 అయినంత మాత్రాన ఇద్దరమూ దిగ్గజాలం అయిపోముగా అని అంది. జెర్సీ ఒకటే అయినా మా ఇద్దరి ఆట తీరు ఒకేలా ఉండదని కూడా చెప్పింది. 18వ నంబర్ జెర్సీ తీసుకోవాలనేది నా చాయిస్ అని మంధాన తెలిపింది.
Red & Gold, now with some extra gold 🥹#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 pic.twitter.com/RESAap0mm6
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
డబ్య్యూపీఎల్ తొలి సీజన్లో నిరాశపరిచిన ఆర్సీబీ రెండో సీజన్లో ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. మార్చి 17న ఢిల్లీలో జరిగిన ఫైనల్లో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. 19.3 ఓవర్లలోనే 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి తొలిసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దాంతో, ఆర్సీబీ 16 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్లో మూడుసార్లు బెంగళూరు ఫైనల్ చేరినా.. కప్పు కొట్టలేకపోయింది. కానీ, అమ్మాయిల బృందం మొదటి ఫైనల్లోనే ట్రోఫీని పట్టేసి ఔరా అనిపించింది.
ఇవి కూడా చదవండి
- Sanjay Mukherjee: బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీ
- Kodangal | సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థినులకు తప్పని తిప్పలు
- Tirumala | తిరుమల శ్రీవారి ఆదాయం రూ. 4.78 కోట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

