తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదేవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందు కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. అయితే టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,051 మంది భక్తులు దర్వించుకోగా 23,107 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఏప్రిల్ 5న తిరుమలలో 521వ అన్నమయ్య వర్థంతి
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య (Annamaiah )ల 521వ వర్థంతిని ఏప్రిల్ 5న తిరుమలలో టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు సాయంత్రం 5.30 గంటలకు ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు.