INDW vs ENGW : నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో స్మృతి మంధాన(55 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడుతోంది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్న మంధాన 27 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసింది. అలిసే క్యాప్సలే బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు టీ20ల్లో ఇది 31వ ఫిఫ్టీ కావడం విశేషం.
మరో ఎండ్‌లో ధనాధన్ ఆడుతున్న షఫాలీ వర్మ(20)ను అర్లాట్ వెనక్కి పంపింది. పెద్ద షాట్‌కు యత్నించిన ఆమె ఎకిల్‌స్టోన్ చేతికి చిక్కింది. దాంతో, 77 వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చీరాగానే హర్లీన్ డియోల్ (20 నాటౌట్) బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత లిన్సే స్మిత్‌కు చుక్కలు చూపించిన డియోలో మూడు ఫోర్లు కొట్టింది. అంతే.. స్కోర్ 90 దాటింది. 10 ఓవర్లకు భారత జట్టు వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.
Smriti Mandhana’s 31st T20I fifty is a spectacular one 🔥
🔗 https://t.co/9SQ3H0VqA4 pic.twitter.com/hMz9NP3oB8
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025