తాండూర్ : దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ( KCR Birthday ) సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandoor ) మండల కేంద్రం ఐబీలో బీఆర్ఎస్ ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బా దత్తుమూర్తి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు .

ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గడించి, ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. కోట్లాది మంది ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో వృద్ధులకు, ప్రయాణికులకు అరటి పండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, నాయకులు దత్తాత్రేయ రావు, బోనగిరి చంద్రశేఖర్, ఎలుక రామచందర్, మొగిలి శంకర్, దుర్గం శ్రీనివాస్, పెరిక రాజన్న, మద్దిబోయిన అర్జున్, అబూ సాదు, బోడ సతీష్, జాడి పోశం, చింటూ, బాబుఖాన్, రేపాక రమేష్, రాజేందర్, హనీఫ్, అరవింద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.