Jaggery Water | తీపి వంటకాలు అనగానే మనకు సహజంగానే చక్కెర గుర్తుకు వస్తుంది. కానీ చక్కెరను అధికంగా తినడం మంచిది కాదని, ప్రత్యామ్నాయంగా బెల్లంను ఉపయోగించాలని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే బెల్లాన్ని సహజసిద్ధంగా తయారు చేస్తారు. చక్కెర అంటే రీఫైన్డ్ పదార్థం. కనుక ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వైద్యులు అంటుంటారు. అయితే బెల్లాన్ని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని కూడా తీపి వంటకాల తయారీలో వాడుతారు. అయితే గోరు వెచ్చని నీటిలో బెల్లాన్ని వేసి కరిగించి ఆ నీళ్లను ఉదయం పరగడుపున తాగాలని, దీంతో ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తయారు చేసి బెల్లం నీళ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అంటున్నారు.
బెల్లం నీటిలో సుక్రోజ్ అధికంగా ఉంటుంది. కనుక ఉదయం పరగడుపునే బెల్లం నీళ్లను తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీని వల్ల చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. యాక్టివ్గా మారుతారు. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట రావు. బద్దకం పోతుంది. బెల్లం నీళ్లు శరీరానికి చలువ చేస్తాయి. శరీరంలో ఉన్న వేడి పోతుంది. శరీరం చల్లగా మారుతుంది. దీని వల్ల బయట తిరిగే వారు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బెల్లం నీళ్లను తాగడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది. ఈ నీటిలో డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల బెల్లం నీళ్లను తాగితే శరీరంలోని వ్యర్థాలు, అలాగే లివర్లో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థలో పలు ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి అంతర్గతంగా ఉండే అవయవాలను క్లీన్ చేస్తాయి. శరీరం మొత్తం డిటాక్స్ అవుతుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి.
బెల్లం నీళ్లను ఉదయం తాగడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్తేజం చెంది మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలో అనేక మినరల్స్ ఉంటాయి. జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అనేక స్వల్ప మొత్తంలో పలు రకాల విటమిన్లు ఉంటాయి. అందువల్ల బెల్లం నీళ్లను సేవిస్తుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. శ్వాస నాళాలు క్లియర్ అవుతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది.
బెల్లంలో ఐరన్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల తయారీకి దోహదం చేస్తాయి. బెల్లం నీళ్లను రోజూ తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ముఖ్యంగా శాకాహారులు, మహిళలకు బెల్లం నీరు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తాగుతుంటే రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బెల్లం శరీరంపై చల్లదనపు ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల బెల్లం నీళ్లను సేవిస్తుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని వేడి బయటకు పోతుంది. వెచ్చదనం తగ్గి ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. బెల్లం నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. కనుక డీహైడ్రేషన్ బారిన పడిన వారు తాగితే వెంటనే కోలుకుంటారు. ఇలా బెల్లం నీళ్లతో మనకు అనేక లాభాలు కలుగుతాయి.