చెన్నై: టీ20 వరల్డ్‌కప్‌లో కెనడా బ్యాటర్ సెంచరీ కొట్టాడు. 19 ఏళ్ల ఆ బ్యాటర్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 110 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. టాస్ గెలిచిన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సమ్రా కేవలం 58 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడతను. భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ స్పూర్తితో సమ్రాకు అతని తండ్రి ఆ పేరు పెట్టాడు.
ఈ యువ క్రికెటర్ ఇటీవల కొన్ని మ్యాచుల్లో జోరుగా బ్యాటింగ్ చేశాడు. వరల్డ్‌కప్‌కు ముందు గత ఏడాది జరిగిన ఓ టోర్నీల్లో యువరాజ్ సమ్రా 15 బంతుల్లోనే బహమాస్‌పై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఇవాళ న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టుపై సమ్రా సెంచరీ కొట్టడం అతని ట్యాలెంట్‌ను బయటపెట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసే కివీస్ బౌలర్లలను అతను ఊచకోత కోశాడు. తొలుత 36 బంతుల్లో సమ్రా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతిపిన్న వయసులో టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ కొట్టిన రికార్డు గతంలో పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉన్నది. అతను 22 ఏళ్ల వయసులో సెంచరీ చేశాడు.
Yuvraj Samra produces an all-time #T20WorldCup special in Chennai 💯👏 pic.twitter.com/cSCGMQGsiX
— ICC (@ICC) February 17, 2026