Educational | పెద్దపల్లి, జూన్28: సర్కారు బడుల్లో చదివే విద్యార్దులలో విద్యా ప్రమాణాలు పెంపొందించటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులతో శనివారం కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే లక్ష్యాలను నిర్దేశించుకోని వాటి సాధన దిశగా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు సహకాలంలో హాజరు కావాలన్నారు. ప్రాథమిక తరగతులలోనే తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ వంటి కనీస విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థికి రావాలన్నారు. సమావేశంలో పీఎం షేక్, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.