Sunil Gavaskar : భారత దిగ్గజ ఆటగాడు, తొలి వరల్డ్ కప్ హీరో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar)కు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రాలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్నిస్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఆ ప్లాట్‌ను ముంబై రంజీ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane)కు అప్పగించాలని ఏక్నాథ్ షిండే సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..?
టీమిండియా లెజెండ్ అయిన గవాస్కర్ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. తన సొగసైన ఆటతో దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన అతడికి 1988లో అప్పటి ప్రభుత్వం బంద్రా ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే భావి క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం కోసం ఆ స్థలాన్ని ఇస్తున్నట్టు కూడా చెప్పింది.
కానీ, లిటిల్ మాస్టర్ మాత్రం ఇప్పటివరకూ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. దాంతో, దాదాపు 36 ఏండ్లుగా ఆ స్థలం నిరూపయోగంగా పడి ఉంది. అందుకని ఆ ప్లాట్‌ను రహానేకు కట్టబెట్టాలని షిండే ప్రభుత్వం భావించింది. అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఆ స్థలాన్ని రహానేకు లీజుకు ఇస్తున్నట్టు తెలిపింది.
భారత జట్టు గొప్ప ఆటగాళ్లలో ఒకడైన ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌కే పరిమితం అయ్యాడు. నిరుడు ఐపీఎల్(IPL) ఫామ్‌తో మళ్లీ సీనియర్ జట్టుకు ఆడిన రహానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పర్వాలేదనిపించాడు. కానీ, ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. అయితే.. రంజీల్లో మాత్రం కెప్టెన్‌గా మెప్పిస్తున్నాడు. ముంబైకి 42వ రంజీ ట్రోఫీ సాధించి పెట్టిన రహానే త్వరలో జరుగబోయే ఇరానీ కప్(Irani Cup 2024)లోనూ ఆ జట్టును నడిపించనున్నాడు. అక్టోబర్ 1 న మొదలయ్యే ఈ టోర్నీలో రెస్టాఫ్ ఇండియాతో ముంబై తలపడనుంది.