Israeli Strikes | లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 182 మంది దుర్మరణం..
Israeli Strikes | లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 272 మంది వరకు గాయపడ్డారని తెలిపింది.
Israeli Strikes | లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 272 మంది వరకు గాయపడ్డారని తెలిపింది. అక్టోబర్ 7 తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో ఉన్న ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు సూచించింది. బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్‌లైన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు పేర్కొంది.
వైమానిక దాడి జరగక ముందే భవనాలను ఖాళీ చేయాలని సూచించింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని డజన్ల కొద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగింది. మజ్దాల్ సేలం, హులా, తౌరా, క్లయిలే, హారిస్, నబీ చిట్, హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఐడీఎఫ్ వైమానిక దాడులు జరిపింది. మృతుల్లో మహిళలు, పిల్లలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ బెకా వ్యాలీలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతుందని.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ లెబనాన్‌లో వైమానిక దాడులు ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దాడి చేయబోతున్నందున లెబనాన్ ప్రజలు తమ భద్రత కోసం హెచ్చరికలు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సుమారు 300 కంటే ఎక్కువ హిజ్బుల్లా సైట్లను ధ్వంసం చేసింది. అయితే, ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూప్‌లను యుద్ధం అంచున నుంచి వెనక్కి వెళ్లాలే ప్రపంచ శక్తులు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సౌత్ ఫ్రంట్ నుంచి లెబనాన్ ఉత్తర సరిహద్దు వరకు హింసాకాండ జరుగుతున్నదని.. తాము నిద్రపోవడం.. బాంబుల మోతతో మేల్కొంటున్నామని.. తమ జీవితాలు అలా మారిపోయాయని దక్షిణ లెబనీస్ మహిళ వఫా ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. లెబనాన్ దక్షిణ, తూర్పు భాగంలోని ప్రాంతాలతో పాటు రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు హిజ్బుల్లాకు పెట్టని కోటలుగా పేర్కొంటారు. దాడులకు ముందు లెబనీస్కు ఇజ్రాయెల్ నుంచి త్వరగా ఖాళీ చేయమని ఫోన్ సందేశాలు వచ్చాయని అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. లెబనాన్‌లోని ఒక శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తి అయిన హిజ్బుల్లా, ఇరాన్ కూడా మద్దతునిచ్చే పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ దళాలతో దాదాపు రోజువారీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు వస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Air strikes
- IDF
- Israel
- Lebanon
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

