IPL 2025 : ఐపీఎల్లో 18 సీజన్లో మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారాయ్యాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆ మూడింటా ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సోమవారం కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad)ను ఢీ కొడుతోంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగనుండంతో విజయంపై కన్నేసింది రిషభ్ పంత్ సేన. గత రికార్డులు చూస్తే.. ఇరుజట్లు 5 సార్లు తలపడగా లక్నో 4 విజయాలతో ఆధిక్యంలో ఉంది. ప్లే ఆఫ్స్ సమరంలో నిలవాలంటే గెలవక తప్పని గేమ్ కావడంతో.. ఆరెంజ్ ఆర్మీపై ఉన్న రికార్డు తమకు లాభిస్తుందని.. విజయం తమనే వరిస్తుందని లక్నో భావిస్తోంది.
గత మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరిన లక్నో ఈసారి మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. రిషభ్ పంత్ (Rishabh Pant) నేతృత్వంలోని లక్నో 11 మ్యాచుల్లో 5 విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. అయితే.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించిన గుజరాత్ టైటాన్స్.. తనతో పాటు పంజాబ్, ఆర్సీబీని కూడా నాకౌట్‌కు తీసుకెళ్లింది. దాంతో, చివరిదైన ఒక్క బెర్తుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీతో లక్నోకు తగ్గ పోరు ఉంది.
A high-voltage game awaits 🔥
Who’s walking away with the win tonight? 🤔#TATAIPL | #LSGvSRH | @LucknowIPL | @SunRisers pic.twitter.com/1wOVSpsPV6
— IndianPremierLeague (@IPL) May 19, 2025
ఈ పరిస్థితుల్లో తదుపరి మూడు మ్యాచులు పంత్ బృందానికి చాలా కీలకం. టాపార్డర్ రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్ వైఫల్యం లక్నోను దెబ్బతీస్తోంది. ఓపెనర్ మర్క్రమ్, ఆయుష్ బదొనిలు మాత్రమే నిలకడగా ఆడుతుండడం.. కెప్టెన్ పంత్ వరుసగా విఫలం కావడం.. నికోలస్ పూరన్ మెరుపులు ఆరంభ మ్యాచ్‌లకే పరిమితం కావడంతో ప్లే ఆఫ్స్ రేసులో లక్నో వెనకబడింది.
సన్‌రైజర్స్ విషయానికొస్తే.. నిరుడు రన్నరప్‌గా నిలిచిన కమిన్స్ సేన ఈసారి పేలవమైన ఆటతో నిరాశపరిచింది. టాపార్డర్‌ను మాత్రమే నమ్ముకొని భారీ మూల్యం చెల్లించుకుంది. బౌలింగ్ యూనిట్‌గానూ విఫలం అయిన ఆరెంజ్ ఆర్మీ 11 మ్యాచుల్లో మూడే విజయాలతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసునుంచి వైదొలిగిన కమిన్స్ బృందం ఇక పరువుకోసం ఆడనుంది. తదుపరి లీగ్ మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలోపైకి ఎగబాకానుకుంటోంది.
Back again, #OrangeArmy 🧡#TATAIPL2025 pic.twitter.com/PRxznsVidN
— SunRisers Hyderabad (@SunRisers) May 12, 2025
ఈ నేపథ్యంలోనే సోమవారం లక్నోతో మ్యాచ్ గెలుపై లక్ష్యంగా ఆడనుంది హైదరాబాద్. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందే కరోనా బారిన పడిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) అనుమానమే. దాంతో, అభిషేక్ శర్మకు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. ఆరెంజ్ ఆర్మీ.. మే 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 25న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.