కారేపల్లి, మే 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పాజిమలైగూడెంలో సోమవారం సాయంత్రం పడిన పిడుగుపాటుకు సుమారు 20 గొర్రెలు మృతిచెందాయి. బాచుమల్లయ్యగూడెంకు చెందిన మద్దెల లక్ష్మయ్య తన భార్య లక్ష్మితో కలిసి గొర్రెలను సమీపంలోని అడవికి మేపేందుకు తీసుకువెళ్లాడు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో గొర్రెలను ఇంటికి తోలుకు వస్తుండగా పాటిమీద గుంపు స్మశాన వాటిక సమీపంలో పిడుగుపాటుకు గురై చనిపోయాయి. కాపరి లక్ష్మయ్య అతడి భార్యకు గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
Karepalli : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి… కాపరికి తీవ్రగాయాలు