IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ముగిసి రెండు రోజులైనా కాలేదు.. అప్పుడే కొన్ని జట్లు కోచింగ్ సిబ్బందిని మార్చే పనిలో పడ్డాయి. వరుసగా రెండు సీజన్లలో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ టీమ్‌లో మార్పులకు సిద్ధమవుతోంది. తమ ఫ్రాంచైజీ నిరుడు, ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో చైర్మన్ సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka) అసంతృప్తిగా ఉన్నాడట. సో.. కోచింగ్ స్టాఫ్‌లోని కొందరిపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లలో మెంటార్ జహీర్ ఖాన్ (Zaheer Khan) పేరు కూడా ఉండచవచ్చని లక్నో వర్గాలు చెబుతున్నాయి.
టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో సభ్యుడైన జహీర్ ఖాన్ నిరుడు లక్నో కోచింగ్ యూనిట్లో చేరాడు. హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి మెంటార్‌గా వ్యూహరచనలు చేశాడీ మాజీ పేసర్. అయితే.. 18వ సీజన్లో లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. ఆరంభంలో అదరగొట్టినా.. కీలక మ్యాచుల్లో ఓడిపోయింది. 14 మ్యాచుల్లో ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తుకు దూరమైంది.
Superhit andaaz 💥💙 pic.twitter.com/yVp9mYPncV
— Lucknow Super Giants (@LucknowIPL) May 31, 2025
వేలంలో రికార్డు ధర పలికిన కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ మినహా పెద్దగా రాణించలేదు. అతడిని సానబెట్టడంలో మెంటార్‌గా జహీర్ విఫలమయ్యాడని సంజీవ్ గొయెంకా భావిస్తున్నాడు. అయితే.. ఈ సీజన్లో భయం లేకుండా చెలరేగి ఆడాలని అనుకున్న లక్నో మైదానంలో మాత్రం తేలిపోయింది. మరోవైపు హిట్టర్ నికోలస్ పూరన్, మిడిలార్డర్లో సమద్ తేలిపోవడంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. దాంతో, వచ్చే సీజన్‌కు పక్కాగా సన్నద్ధం కావాలనే ఆలోచనతో ఉన్న ఆయన.. కొత్త మెంటార్ కోసం చూస్తున్నాడని టాక్. అదే నిజమైతే లక్నో మెంటార్‌గా జహీర్ పదవీ కాలం ఒక్క ఏడాదితో ముగియనుంది.