Bangladesh Cricket Board : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ముందు బంగ్లాదేశ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెస్టు జట్టు సారథిగా ఉన్న నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto) పదవీ కాలాన్ని మరో ఏడాదికి పొడిగించింది. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ కోసం బుధవారం శాంటో కెప్టెన్‌గా 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు.
డబ్ల్యూటీసీ 2025-27లో తొలి సిరీస్ కావడంతో పటిష్ఠమైన బృందాన్ని ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించిన సెలెక్టర్లు గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు స్క్వాడ్‌లో చోటు కల్పించారు.
The @BCBtigers has announced a 16-member squad for the upcoming two-match Test series against @OfficialSLC, which marks the beginning of Bangladesh’s journey in the 2025–2027 ICC World Test Championship cycle.https://t.co/soPf8Zrly0
— Dhaka Tribune Sports (@Sport_DT) June 4, 2025
రెండేళ్ల క్రితం చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పేసర్ హెబాడాట్ హొసేన్‌ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఇద్దరితో పాటు ఎడమ చేతివాటం స్పిన్నర్ హసన్ మురాద్, కుడిచేతివాటం పేసర్ నహిద్ రానాలు లంక టెస్టులకు సెలెక్ట్ అయ్యారు.
అయితే.. స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన ముగ్గురిపై వేటు పడింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తన్వీర్ ఇస్లాం, పేసర్ తంజిమ్ హసన్ షకీబ్, ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. బంగ్లాదేశ్ బృందం జూన్ 13న లంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో జూన్ 17న గాలేలో తొలి టెస్టు ఆడనుంది. అనంతరం కొలంబోలో జూన్ 25న రెండో మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతాయి.
బంగ్లాదేశ్ టెస్టు స్క్వాడ్ : నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, అనాముల్ హక్ బిజోయ్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, మహిదుల్ ఇస్లాం భుయాన్, జకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్‌కు (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, నయీం హసన్, హసన్ మురాద్, ఎబదాత్ హొసేన్, హసన్ మహమూద్, నహిద్ రానా, సయ్యద్ ఖలీద్ అహ్మద్.