పాట్నా: అత్యాచార బాధితురాలి తల్లికి చికిత్స చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. డాక్టర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు. (Doctor Tied To Tree Assaulted) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయాల నుంచి రక్తం కారుతున్న డాక్టర్‌ను కాపాడారు. బీహార్‌లోని గయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝురాంగ్ గ్రామానికి చెందిన గ్రామీణ డాక్టర్ జితేంద్ర యాదవ్ అత్యాచార బాధితురాలి తల్లికి వైద్యం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆ మహిళతో అతడికి సంబంధం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు కొట్టడం వల్ల శరీరం నుంచి రక్తం కారుతున్న డాక్టర్ జితేంద్ర కట్లు విప్పి కాపాడారు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీహార్‌లో పరిస్థితి తాలిబన్ల కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. అత్యాచార బాధితురాలి తల్లికి చికిత్స చేయడానికి వెళ్లిన వైద్యుడిని నిందితులు చెట్టుకు కట్టేసి కొట్టారని విమర్శించారు.
‘20 సంవత్సరాల అవినీతి ఎన్డీయే పాలన తర్వాత పోలీసులు, పాలకులు నేరాలను నిరోధించడంలో, నేరస్థులను అరెస్టు చేయడంలో లేదా న్యాయం అందించడంలో పూర్తిగా అసమర్థంగా ఉన్నారు. ఫలితంగా ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. బీహార్ గందరగోళంలో ఉంది. ముఖ్యమంత్రి స్పృహ కోల్పోయారు. ప్రభుత్వం మత్తులో ఉంది. అధికారులు, మంత్రులు ఖజానాను దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. పాలన అస్తవ్యస్తంగా ఉంది’ అని తేజస్వి యాదవ్ ఆరోపించారు.
बिहार में तालिबान से भी बदतर स्थिति है। गया जिला में बलात्कार पीड़िता की मां का इलाज करने गए डॉक्टर को आरोपियों ने पेड़ से बांधकर पीट-पीट कर खून से लथपथ कर दिया।
20 वर्षों की भ्रष्ट NDA सरकार में पुलिस और प्रशासन अपराध रोकने, अपराधियों को पकड़ने, सजा एवं न्याय दिलाने में बिल्कुल… pic.twitter.com/5brL4tbn21
— Tejashwi Yadav (@yadavtejashwi) June 4, 2025
Also Read: