రాయ్‌పూర్: వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తున్నది. గుట్కా ఉమ్మేందుకు డ్రైవర్ డోర్ తెరిచాడు. (Driver opens door spit gutka) దీంతో ఆ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు బయటకు ఎగిరిపడ్డారు. ఒకరు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చకర్ భట ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల జాకీ గెహి బట్టల వ్యాపారి. ఆదివారం రాత్రి ఒక పార్టీలో పాల్గొన్నాడు. తనను పికప్ చేసుకోవాలని స్నేహితుడు ఆకాష్ చందానీకి ఫోన్ చేశాడు. దీంతో ఫ్రెండ్ పంకజ్ చాబ్రాతో కలిసి అతడు అక్కడకు చేరుకున్నాడు. పార్టీ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ముగ్గురు ఇన్నోవా కారులో బయలుదేరారు.
కాగా, ఆకాష్ కారు నడపగా ముందు సీటులో పంకజ్, వెనుక సీటులో జాకీ కూర్చొన్నారు. బిలాస్పూర్ - రాయ్‌పూర్ హైవేపై వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్లింది. డ్రైవ్ చేస్తున్న ఆకాష్ అకస్మాత్తుగా డోర్ తెరిచి గుట్కా ఉమ్మాడు. దీంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు. డివైడర్ వైపు దూసుకెళ్లిన కారు పలుసార్లు పల్టీలు కొట్టింది. అందులో ఉన్న ముగ్గురు బయటకు ఎగిరిపడ్డారు. గాల్లోకి ఎగిరిన జాకీ ఒక పోల్‌ను తాకడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆకాష్, పంకజ్ తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు పలుమార్లు పల్టీలు కొట్టిన ఆ కారు చివరకు ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ కూడా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
छत्तीसगढ़ | बिलासपुर में गुटखा थूकने के चक्कर में गई जान, डिवाइडर से टकराकर पलटी कार, 1 मौके पर हुई मौत#Chhattisgarh #Bilaspur #RoadAccident #CarAccident pic.twitter.com/sxL01cp6Tf
— Vistaar News (@VistaarNews) June 3, 2025
Also Read: