England Cricket : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ (England) వన్డే సవాల్‌కు సిద్దమవుతోంది. త్వరలోనే వెస్టిండీస్‌తో ఇంగ్లీష్ జట్టు వైట్ బాల్ క్రికెట్ ఆడనుంది. కానీ, రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ఇంకా కోలుకోలేదు. దాంతో, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సెలెక్టర్లు కొత్త సారథిని ప్రకటించారు.
స్వదేశంలో ఈ మధ్యే ముగిసిన ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ బ్రూక్ (Harry Brook) టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. దాంతో ఆల్‌రౌండర్ లియాం లివింగ్‌స్టోన్ (Liam Livingstone)ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోమవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, లాంక్షైర్ బోర్డులు అధికారికంగా వెల్లడించాయి. ఈ విషయాన్ని సోమవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, లాంక్షైర్ బోర్డులు అధికారికంగా వెల్లడించాయి.
Skipper. 🫡🏴
Liam Livingstone will step in as captain for the ODI series with the Lancashire all-rounder set to lead England for the first time whilst Jos Buttler continues his recovery from injury.
🌹 #RedRoseTogether pic.twitter.com/qmiCJXPQXM
— Lancashire Cricket (@lancscricket) October 21, 2024
ఇంగ్లండ్ స్క్వాడ్ : ఫిల్ సాల్ట్, జాకబ్ బెతెల్, జాఫర్ కొహన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియాం లివింగ్‌స్టోన్(కెప్టెన్), సకీబ్ మహమ్మద్, డాన్ మౌస్లే, జేమీ ఓవర్టన్, రీసే టాప్లే, జోఫ్రా ఆర్చర్, జాన్ టర్నర్.
ఇప్పటివరకూ టీ20ల్లో ఒకటి రెండు సార్లు జట్టును నడింపించిన లివింగ్‌స్టోన్ వన్డేల్లో సారథ్యం వహించడం మాత్ర ఇదే మొదటిసారి. ఇంగ్లండ్ జట్టు ఇదే నెలలో మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 31న తొలి వన్డే మొదలవ్వనుంది. అనంతరం నవంబర్ 2వ తేదీన రెండో వన్డే, నవంబర్ 6వ తేదీన మూడో వన్డేలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు తలపడనున్నాయి.
JUST IN: Jos Buttler will miss England’s ODI series against West Indies after a setback in his recovery from a calf injury.
Liam Livingstone will captain England in his absence, with Buttler to join the squad ahead of the five-match T20I series pic.twitter.com/NE4ygbSRl4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2024