Emerging Asia Cup : ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత ఏ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. కన్నేసింది. తొలి పోరులో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను బెంబేలెత్తించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి భారీ గెలుపు నమోదు చేసింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ(58 :24 బతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ తిలక్ వర్మ(21)లు బౌండరీలతో డీల్ చేశారు. ఈ ఇద్దరూ వెనుదిరిగాక ఆయుష్ బదొని(12 నాటౌట్)లు లాంఛనం పూర్తి చేశాడు. అతడు వరుసగా 6, 4 బాదడంతో 7 వికెట్ల తేడాతో భారత్ అలవోకగా గెలుపొందింది. తద్వారా 4 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత ఏ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా పసికూన యూఏఈపై జయభేరి మోగించింది. 108 పరుగుల ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ(58), ప్రభ్సిమ్రాన్ సింగ్(8)లు వీరకొట్టుడు కొట్టారు. ఒమిద్ రహమాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి సిమ్రాన్ బౌల్డ్ అయ్యాక.. సారథి తిలక్ వర్మ(21) జతగా అభిషేక్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు.
The Men in Blue cruise to victory, chasing down 107 with 7 wickets to spare! A dominant all-round performance seals the win for India ‘A’! 🙌#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/WzQ9cUGsbf
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
తిలక్ సైతం బ్యాట్ ఝులిపించడంతో భారత్ స్కోర్ ఆరు ఓవర్లకు 74కు చేరింది. అయితే.. విజయానికి 21 పరుగుల దూరంలో తిలక్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వత నేహల్ వధేరా()తో కలిసి అయుష్ బదొని(12 నాటౌట్) జట్టును గెలిపించాడు. 11వ ఓవర్లో బదొని వరుసగా 6, 4 బాదడంతో టీమిండియా7 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది.
మెగా టోర్నీలో ఇప్పటికే బోణీ కొట్టిన భారత ఏ జట్టు రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. పసికూన యూఏఈని 107 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యూఏఈ 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ రాజేశ్ కుమార్(10)ను అన్షుల్ కాంబోజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత రసిక్ దార్ సలాం(3/15), రమన్‌దీప్ సింగ్(2/7)లు యూఏఈ బ్యాటర్లను వణికించారు.
Rasikh Salam was was on 🔥 today!#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/lGrVAWYIWh
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
ఓవైపు వికెట్లు పడుతున్నా రాహుల్ చోప్రా(50 : 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి కెప్టెన్ బసిల్ హమీద్(22) చక్కని సహకారం అందించాడు. దాంతో, యూఏఈ స్కోర్ వంద దాటింది. అయితే.. అర్ధ శతకం బాదిన రాహుల్‌ను నేహల్ వధేరా ఔట్ చేయడంతో 107 వద్ద ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.