Anannya nagalla | టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Anannya nagalla), యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్ (Pottel). ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్నాడు. తన కుమార్తెను చదివించాలనుకునే ఒక గొర్రెల కాపరి కథ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమా కోసం బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చానంది అనన్య నాగళ్ల. నా పాత్ర పొట్టేల్ సినిమా స్థాయిని పెంచుతుంది. సినిమా విడుదలయ్యాక ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉంటుందని చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ల. ఇప్పుడీ కామెంట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
పొట్టేల్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనుండగా.. నైజాం పంపిణీ హక్కులను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూలర్స్ ఎల్ఎల్పీ దక్కించుకుంది. పొట్టేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి మేక (Bujji meka song) సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గుర్రంగట్టు ప్రాథమిక పాఠశాల ముందు అనన్య నాగళ్ల తన కుటుంబంతో దిగిన పోస్టర్లో.. పొట్టేల్తో మనుషులకు ఉన్న అనుబంధం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింబే బోనాల పండుగను హైలెట్ చేస్తున్న దృశ్యాలు.. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం లాంటి అంశాల సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు