VVS Laxman |: స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు నవంబర్‌లో బీజీ షెడ్యూల్ ఉంది. ఆస్ట్రేలియా పర్యటన ఉన్నందున ప్రస్తుతం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) జట్టుతో పాటు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో తాత్కాలిక కోచ్ అవసరం ఏర్పడింది. అందుకని మాజీ ఆటగాడు వీవీఎస్. లక్ష్మణ్ (VVS Laxman)కు మరోసారి బాధ్యత అప్పగించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు.
నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు లక్ష్మణ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించనున్నారు. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లక్ష్మణ్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ బృంద కూడా దక్షిణాఫ్రికా వెళ్లనుందని సమాచారం.
భారత జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హైదరాబాదీ లక్ష్మణ్‌కు కోచింగ్‌లో అనుభవం ఉంది. గతంలో ఐర్లాండ్ పర్యటనకు, టీ20 వరల్డ్ కప్ అనంతరం జింబాబ్వే టూర్‌కు లక్ష్మణ్ టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా పని చేశాడు. అందుకని ఈసారి గంభీర్ దక్షిణాఫ్రికా పర్యటనకు అందుబాటులో లేకపోవడంతో.. మరోసారి అదే పాత్రను పోషించాల్సిందిగా సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు లక్ష్మణ్‌ను సంప్రదించారు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత బృందం సఫారీ గడ్డపై 4 టీ20లు ఆడనుంది. తొలి మ్యాచ్ నవంబర్ 8న డర్బన్‌లో, గెబెర్హాలో రెండో టీ20 నవంబర్ 10న జరుగనున్నాయి. నవంబర్ 13న సెంచూరియన్‌లో, 15వ తేదీన జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే చివరి రెండు టీ20ల్లో భారత్, దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ కోసం ఇప్పటికే సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. ఐపీఎల్లో అమితంగా రాణించిన రమన్‌దీప్ సింగ్, బౌలర్ విజయ్‌కుమార్ వైశాక్, యశ్ దయాల్‌లను ఎంపిక చేశారు.
టీ 20 స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజా శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్