Devara | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం త్వరలో 50 రోజుల మార్క్‌ను అందుకోబోతుంది. అయితే ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా దావుదీ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆయుధా పూజ వీడియోను వదలగా.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా దావుదీ కూడా రావడంతో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. యువసుధా ఆర్ట్స్ పతకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.