Kusal Mendis : శ్రీలంక క్రికెటర్ కుశాల్ మిండిస్ సంచలనం సృష్టించాడు. టెస్టుల్లో శ్రీలంక తరఫున అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి శ్రీలంక ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 28 ఏళ్ల మెండీస్ ఏకంగా 11 సిక్సర్లు బాదాడు. దాంతో, మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(Kumar Sangakkara) 9 ఏళ్ల రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. 2014లో సంగక్కర బంగ్లాదేశ్(Bangladesh)పై 8 సిక్స్‌లు కొట్టి రికార్డు నెలకొల్పాడు.
న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక స్వదేశంలో సత్తా చాటుతోంది. గాలే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగి ఆడారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ రికార్డు స్థాయిలో 492 రన్స్ కొట్టింది. అందుకు శ్రీలంక ధీటుగా బదులిచ్చింది. కుశాల్ మెండిస్(245) డబుల్ సెంచరీతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ నిషాన్ మధుషక్క(205) కూడా ద్విశతకం బాదాడు. దాంతో, శ్రీలంక 704-3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 2 వికెట్ల నష్టానికి 54 రన్స్ కొట్టింది. ఇంకా ఆ జట్టు 158 పరుగులు వెనకబడి ఉంది.