IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రికార్డు ఛేదన అంటే పంజాబ్ కింగ్స్(Pujab Kings) పేరే గుర్తుకొస్తుంది. 17వ సీజన్లో 262 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది పంజాబ్. అది కూడా మిస్టరీ స్పిన్నర్లతో ప్రత్యర్థుల భరతం పట్టే కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పైనా. అందుకే.. ఈ రెండు జట్లు తలపడతున్నాయంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ పంజాబ్, కోల్‌కతాలు కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి.
ఏప్రిల్ 26, శనివారం రాత్రి 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) నేతృత్వంలోని పంజాబ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది. నిరుడు కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన అయ్యర్ ఈసారి ప్రత్యర్థిగా ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 12 పాయింట్లతో పంజాబ్ నాలుగో స్థానానికి దూసుకెళ్లనుంది. ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు ఈ మ్యాచ్ కీలకమే.
Prediction Time 💭
What does #KKRvPBKS have in store for us tonight? ✍️ #TATAIPL | @KKRiders | @PunjabKingsIPL pic.twitter.com/inviucrGXG
— IndianPremierLeague (@IPL) April 26, 2025
అందుకే.. అజింక్యా రహానే బృందం సొంత ఇలాకాలో పంజా విసరాలని భావిస్తోంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో గత రికార్డులు పరిశీలిస్తే.. కోల్‌కతాదే ఆధిపత్యం. ఇప్పటివరకూ 34 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ 21 పర్యాయాలు గెలుపొందగా.. పంజాబ్ 13 విజయాలకే పరిమితమైంది.
అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ అదరగొడుతోంది. స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎడిషన్‌లోనే ముల్లనూర్‌లో హర్షిత్ రానా విజృంభణతో 111కే పరిమితమైన పంజాబ్.. ఆ తర్వాత కోల్‌కతాను 106 పరుగులకే కట్టడి చేసి అద్భుత విజయం సాధించింది. యజ్వేంద్ర చాహల్ తిప్పేయడంతో హిట్టర్లతో నిండిన రహానే బృందానికి చెక్ పెట్టి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. దాంతో.. రివెంజ్ వీక్‌లో భాగంగా పంజాబ్‌ను తమ సొంత గడ్డపై చిత్తు చేయాలని కోల్‌కతా ఆటగాళ్లు కసితో ఉన్నారు.
When #KKR and #PBKS meet, expect the unexpected 👀
Will tonight give us another record to remember? 🤔#TATAIPL | #KKRvPBKS | @KKRiders | @PunjabKingsIPL pic.twitter.com/CW8P1Y8opT
— IndianPremierLeague (@IPL) April 26, 2025