IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రివెంజ్ మ్యాచ్‌లు అలరిస్తున్నాయి. టాప్ -4లో నిలిచేందుకు పలు జట్లు గట్టి పోటీనిస్తున్నాయి. ఇకపై ప్రతి మ్యాచ్ చావోరేవో కావడంతో అన్ని జట్లు విజయంపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ వంటి స్టార్ ఆటగాళ్లను నమ్ముకుంటే.. గుజరాత్, పంజాబ్, లక్నో మాత్రం యువకెరటాలపై ఆశలు పెట్టుకున్నాయి. 18వ ఎడిషన్‌లో ముగ్గురు యంగ్‌స్టర్స్ తమ సత్తా చాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ త్రీ యంగ్ గన్స్ ఎవరంటే.. ప్రియాన్ష్ ఆర్య(Priyansh Arya), దిగ్వేశ్ రథీ, సాయి కిశోర్(Sai Kishore).
వేలంలో రికార్డు ధర పలికిన రిషభ్ పంత్(Rishabh Pant), శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)లు తరచూ విఫలం అవుతుంటే.. కారుచౌకగా అమ్ముడైన ఈ కుర్రాళ్లు మాత్రం ఇరగదీస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసక ఇన్నింగ్స్‌లతో హడలెత్తిస్తున్నాడు. పవర్ ప్లేలో దంచికొడుతున్న ఈ చిచ్చరపిడిగు పంజాబ్ పాలిట వరంలా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై రెచ్చిపోయి ప్రియాన్ష్ 42 బంతుల్లోనే సెంచరీతో గర్జించాడు.
BRILLIANT CENTURY FOR PRIYANSH ARYA 🇮🇳🤩
– 103(42) including 9 Sixes for PBKS ♥️
pic.twitter.com/748oh8WPKF— The Khel India (@TheKhelIndia) April 8, 2025
అరంగేట్రం సీజన్లోనే వంద కొట్టిన ఈ యువకెరటం.. భవిష్యత్ తారల్లో తాను ఒకడిని అని చాటాడీ లెఫ్ట్ హ్యాండర్. నిరుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన ప్రియాన్ష్ ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. 24 ఏళ్ల ఈ ఫ్యూచర్ స్టార్‌ను పంజాబ్ యాజమాన్యం వేలంలో రూ.3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఈ ఓపెనర్ 8 మ్యాచుల్లో 254 రన్స్‌తో రాణించాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో ప్రత్యేకమైన బౌలర్ ఎవరంటే అతడు.. దిగ్వేశ్ రథీ. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న ఈ స్పిన్నర్ నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో వైరలవుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్న దిగ్వేశ్ మిడిల్ ఓవర్లలో తన స్పిన్ మాయాజాలంతో లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Digvesh Rathi fined again—50% match fee gone. Bro now has 2 demerit points!
At this rate, he’ll donate his entire salary in fines.
Bas BCCI se ek UPI QR code le lo bhai… aur direct bhej diya karo! pic.twitter.com/FUGbENLbQ0— Dinda Academy (@academy_dinda) April 5, 2025
మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన ఇతడి బౌలింగ్ యాక్షన్ అచ్చం.. కోల్‌కతా ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ మాదిరిగా ఉంటుంది. అందుకే.. దిగ్వేష్ బౌలింగ్‌లో స్టార్ ఆటగాళ్లు సైతం తడబడుతున్నారు. ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచుల్లో ఈ లెగ్ స్పిన్నర్ 7.27 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇంతలా రాణిస్తున్న దిగ్వేశ్‌ను లక్నో యాజమాన్యం ఎంతకు కొన్నదో తెలుసా.. కేవలం రూ.30 లక్షలకు.
అరంగేట్రం సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటన్స్ ఈసారి టాప్ గేర్‌లో ఆడుతోంది. ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది శుభ్‌మన్ గిల్ బృందం. ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ చెలరేగి ఆడుతుంటే.. మిడిల్లో జోస్ బట్లర్ బాదేస్తున్నాడు. అయితే.. బౌలింగ్ యూనిట్లో సాయి కిశోర్ ప్రధాన అస్త్రంగా మారాడు.
SAI KISHORE – ONE OF THE BEST SPINNERS IN THE COUNTRY. 💥pic.twitter.com/x4q3v7BLx0
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2025
రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నా సరే.. కిశోర తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ తమిళ తంబీ.. 8.22 ఎకానమీతో 12 వికెట్లు కూల్చాడు. దేశవాళీలో వికెట్ల వేట కొనసాగించిన ఈ ఎడమచేతివాటం స్పిన్నర్‌ను గుజరాత్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.