MLA Vijaya Ramana Rao | కాల్వశ్రీరాంపూర్ ఏప్రిల్ 26. మండల కేంద్రంలో గల వేద వ్యాస హై స్కూల్ 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రమ, పట్టుదల మరియు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని, శ్రీరాంపూర్ మండలం నుండి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి ఈ మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అలాగే 15 ఏళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు వేదవ్యాస హై స్కూల్ యాజమాన్యానికి సహకరిస్తున్నందుకు వారిని అభినందించారు. ఎవరైతే నిజాయితీగా శ్రమిస్తారో వారికి తోడ్పాటు అందిస్తే వారు ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తారని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ట్రస్మా పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, డైరెక్టర్ దివాకర్, ప్రిన్సిపల్ సదయ్య, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.