Asian Boxing Championship : జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పంచ్‌లతో చెలరేగుతున్నారు. ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే 39 పతకాలు ఖరారు కాగా శనివారం మరో నలుగురు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దాంతో, ఈసారి దాదాపు 43 పతకాలు భారత బాక్సర్ల ఖాతాలో చేరనున్నాయి. జోర్డాన్ వేదికగా ఆసియా బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న అండర్ -15, అండర్ -17 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు, అమ్మాయిలు తమ పంచ్ పవర్ చూపిస్తున్నారు.
అండర్ -17 పురుషుల విభాగంలో అమన్ సివచ్ (63 కిలోలు), దేవాన్ష్ (80 కిలోలు) తమ తడాఖా చూపించారు. ఐదో రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫిలీప్పీన్స్, జోర్డాన్‌కు చెందిన ఆటగాళ్లను మట్టికరింపించారు. మహిళల 60 కిలోల విభాగంలో సిమ్రన్‌జీత్ కౌర్(Simranjit Kaur) పంచ్‌కు జోర్డాన్ బాక్సర్ అయా అల్హసనత్ చేతులెత్తేసింది. కనీస పోరాటం చేయకుండానే 5-0తో చిత్తుగా ఓడిపోయింది. ఇక 70 కిలోల ఫైట్‌లో హిమాన్షు పాలస్తీనా బాక్సర్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
📸 Day 5 in Pictures!
The intensity only gets fiercer! 🔥
Each punch, each move, each win— Day 5 at the Youth Nationals captured the spirit of future champions in action. 🥊#PunchMeinHaiDum #Boxing #BFI pic.twitter.com/HHRFxTcNsC
— Boxing Federation (@BFI_official) April 26, 2025
పురుషుల అండర్ -17 క్వార్టర్ ఫైనల్
అమన్ సివాచ్ – 63 కిలోలు.. ఫిలిప్పీన్స్‌కు చెందిన జియాడ్రాచ్ జేమ్స్ కబ్రెరాపై విజయం.
సాహిల్ దుహాన్ – 60 కిలోలు – ఇరాన్ బాక్సర్ అమిరలీ చేతిలో ఓటమి.
అనంత్ గౌరీ శంకర్ దేశముఖ్ – 66 కిలోలు – కజకిస్థాన్ బాకస్ర్ దనియల్ శల్కర్బే చేతిలో ఓటమి.
ప్రియాన్ష్ షెహ్రావత్ – 75 కిలోలు – ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ఖుర్షిద్బెక్ జురేవ్ చేతిలో పరాజయం.
దేవాన్ష్ గులియా – 8- కిలోలు – జోర్డాన్ బాక్సర్ అబ్దుల్లా అల్దబ్బాస్పై విజయం.
లోవెన్ గులియా – 80 కిలోలు – ఇరాన్ బాక్సర్ ఫర్హౌద్ ఘోర్బనీ ధాటికి చేతులెత్తేశాడు.
🥊 Medal Rush for India! 🇮🇳🔥
Team India has guaranteed a staggering 43 medals at the Asian U-15 & U-17 Boxing Championships after the Quarterfinals round! 🏅💥
Our young pugilists are taking the boxing world by storm! 🌟👊#TeamIndia #AsianBoxing #PunchMeinHaiDum pic.twitter.com/pwvnk5xoQT
— Boxing Federation (@BFI_official) April 26, 2025
మహిళల అండర్ -17
సిమ్రన్‌జీత్ కౌర్ – 60 కిలోలు – జోర్డాన్ బాక్సర్ అయా అల్హసనత్పై విజయం.
హిమాన్షి – 70 కిలోలు – పాలస్తీనా బాక్సర్ ఫరాజ్ అబౌ లయలాను చిత్తు చేసింది.