CITU | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 26. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే1న నిర్వహించే మేడేను దీక్ష దినంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడారు. మే డే రోజున ప్రతీ గ్రామ వార్డు బస్తి స్థాయిలో మేడే జెండాలు ఆవిష్కరించాలని, మండల, పట్టణ కేంద్రాల్లో ప్రదర్శనలు సభలు నిర్వహించి, చికాగో అమరుల స్ఫూర్తితో వర్గ పోరాటాలకు సన్నద్ధం కావాలని, ఎర్రజెండా ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా మేడే నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ దొడ్ల రాజబాబు, వివిధ యూనియన్ల నాయకులు కలవేణి గట్టయ్య, చెప్పాల మహేష్, సదయ్య, శ్రీనివాస్, చల్ల రాజయ్య, లక్ష్మణ్, మదనయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.