హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మ సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్నది. జేఎన్టీయూహెచ్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నది. అయితే దరఖాస్తుల స్వీకరణ మాత్రం ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని పీజీఈసెట్ కన్వీనర్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు తెలిపారు.
శుక్రవారం ఉద యం 11:30గంటల నుంచి దరఖాస్తు లు స్వీకరిస్తామని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.