కారేపల్లి, జూలై 22 : వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజు రమేష్ తండ్రి పోతురాజు కృష్ణయ్య సంతాప సభకు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు చీమలపాడు గ్రామానికి చెందిన పాటి కోటయ్య అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన బసవ రాంబాబు చిత్ర పటానికి నివాళులుర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైరా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరపు వెంకటచారి, సొసైటీ వైస్ చైర్మన్ సర్పంచ్ ధారావత్ మంగీలాల్, మాజీ ఎంపీటీసీ ధరంసొత్ శంకర్, మాజీ సర్పంచులు మాలోత్ కిషోర్, బానోత్ శంకర్, మౌనిక, రాంజీ, బీఆర్ఎస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మిర వీరన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, నాయకులు పాటి శ్రీను, అజ్మిర భిక్కు లాల్, బానోత్ ప్రసాద్, వీరబాబు, దారావత్ ఫూల్సింగ్, ఇస్లావత్ రాజాకుమార్, శీలంశెట్టి రాంబాబు, వెంకన్న, పాటి రమేష్, గుగులోతు హారు, భూక్య రాంకిషోర్ పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ