Ayah Posts | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 878 అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అశ్వారావుపేట 43, బూర్గంపహాడ్ 67, చండ్రుగొండ 89, చర్ల 54, దమ్మపేట 133, దుమ్ముగూడెం 105, కొత్తగూడెం 36, మణుగూరు 71, పాల్వంచ 68, టేకులపల్లి 132, ఇల్లందు 80 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆగస్టు 1 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హులు
మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అంగన్వాడీ సెంటర్కు చెందిన స్థానికులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థుల వయోపరిమితి కోసం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సంప్రదించాలి.
ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల స్క్రూటినీ ఆగస్టు 3 నుంచి 14 మధ్య ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ పొందడానికి అధికారిక WDCW (ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్) పోర్టల్లో సంప్రదించాలి. పోస్టుకు అవసరమైన అర్హతల వివరాలు, ఇంకా ఏమైనా అడిగితే వాటిని కచ్చితంగా పూరించాలి. ఇతర వివరాల కోసం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో సంప్రదించాలి.