హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు టీజీ ట్రాన్స్‌కో అప్రెంటిస్‌షిప్ కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 125 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, మరో 125 మంది డిప్లొమా హోల్డర్లకు అవకాశం కల్పించనున్నది. గ్రాడ్యుయేట్లకు అయితే నెలకు రూ. 17,500, డిప్లొమా వారికి నెలకు రూ. 15వేలు ైస్టెపెండ్గా అందిస్తారు.
ఆసక్తి గల వారు https://nats. education.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఈ నెల 26లోపు దరఖా స్తు చేసుకోవాలి. నేరుగా ట్రాన్స్‌కోకు దరఖాస్తు చేసే వారు ఈ నెల 27లోపు దరఖాస్తులు సమర్పించాలి. సందేహాలుంటే ce.training@tgtransco. com ఈ-మెయిల్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.