ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేస్తాం
పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి కాలనీలో విద్యా సంస్థలు, పార్కు అభివృద్ధికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఎంసీ కమిషనర్ సృజన, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు ఆదివారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
- కొండాపూర్ రాజరాజేశ్వరీ కాలనీ పర్యటనలో సీఎంసీ కమిషనర్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ) : పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి కాలనీలో విద్యా సంస్థలు, పార్కు అభివృద్ధికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఎంసీ కమిషనర్ సృజన, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు ఆదివారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
కాలనీ ఆమోదిత లే అవుట్ ప్రకారం ఐదు ఎకరాలు విద్యా సంస్థల స్థాపనకు, ఎకరం పార్కు అభివృద్ధికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని లే అవుట్, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా, విద్యా, పార్కు అవసరాలకు కేటాయించిన భూమిలో కొంతభాగం ఆక్రమణకు గురైనట్లు కమిషనర్లు గుర్తించారు. లే అవుట్ ప్రకారం భూమిని సృష్టంగా డీ మార్కేషన్ చేసిన అధికారులు సంబంధిత శాఖల ద్వారా ఫెన్సింగ్ పనులు చేపట్టారు. తద్వారా భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐదు ఎకరాల స్థలంలో విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎంసీ సృజన విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఎకరం స్థలంలో పార్కు అభివృద్ధి చేస్తామని కమిషనర్ సృజన తెలిపారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆనంతరం సమీపంలోని మార్కెట్ ప్రాంతాలను సీఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి వ్యాపారి తన దుకాణం వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని, రోడ్లపై చెత్త వేయరాదని సూచించారు. సేకరణ సమయంలో చెత్త వాహనాల్లో వ్యర్థాలను వేయాలని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రోడ్లపై చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

